యాప్నగరం

కేసీఆర్ నిర్ణయంతో.. ఆ ముగ్గురికే లబ్ధి!

కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో కేవలం ఆ ముగ్గురికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని విమర్శలు తలెత్తుతున్నాయి.

TNN 13 Sep 2017, 5:56 pm
పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలనే ఆదేశాలతో తెలుగు ప్రజల మనసు గెలుచుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. మెజార్టీ ప్రజలను ప్రభావితం చేసే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలను రాత్రి 11 గంటల వరకూ తెరిచేందుకు వీలు కల్పిస్తూ సర్కారు ఓ జీవోను జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ రాత్రి 10 గంటల వరకే లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. బార్లను మాత్రం రాత్రి 11 గంటల వరకూ తెరిచి ఉంచుతున్నారు. మాల్స్‌లోనూ మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది. రెండేళ్లపాటు నూతన మద్య విధానం అమల్లో ఉంటుంది.
Samayam Telugu new liquor policy in telangana
కేసీఆర్ నిర్ణయంతో.. ఆ ముగ్గురికే లబ్ధి!


మద్యం దుకాణాలను సంఖ్యను పెంచని తెలంగాణ సర్కారు.. ధరలకు సంబంధించిన శ్లాబులను ఆరు నుంచి నాలుగుకి తగ్గించింది. జీహెచ్ఎంసీలో అదనంగా గంటపాటు మద్యం అమ్మకాలకు వీలు కల్పించిన సర్కారు.. ప్రతి మద్యం దుకాణంలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇంతకు ముందు 11 గంటల వరకు మద్యం అమ్మకాలు సాగగా.. దాన్ని మధ్యలో కుదించారని తెలిపారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మళ్లీ రాత్రి 11 గంటల వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి చెప్పారు.

నూతన మద్య విధానం వల్ల అమ్మకాలు పెరిగి ఎక్సైజ్ శాఖ, మద్యం దుకాణదారులు; డ్రంక్ అండ్ డ్రైవ్ చలానాలు పెరిగి ట్రాఫిక్ పోలీసులు మాత్రమే బాగుపడతారని.. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని విమర్శిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.