యాప్నగరం

త్వరలో 'జగన్‌పవన్' సినిమా... డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్: గల్లా ట్వీట్

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్, గవర్నర్ వ్యవహారంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పవన్ నేరుగా చంద్రబాబు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో... టీడీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి.

Samayam Telugu 25 Apr 2018, 7:32 pm
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్, గవర్నర్ వ్యవహారంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పవన్ నేరుగా చంద్రబాబు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో... టీడీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పవన్, జగన్‌లపై సెటైర్లు వేయగా... మరో ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. జగన్-పవన్ అనే సినిమా త్వరలో విడుదల కాబోతోంది. రచనా, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్... సమర్పిస్తున్నవారు మోదీ-షా ప్రొడక్షన్స్ అంటూ పంచ్ పేల్చారు.
Samayam Telugu Gall Jaydev.


జయదేవ్ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారగా... ఎప్పుడు కూల్‌గా ఉండే గల్లా... ఉన్నట్టుండి పవన్‌ను టార్గెట్ చేయడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పరిస్థితి చూస్తే టీడీపీ కూడా కాస్త దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.