యాప్నగరం

ప్రగతి రిసార్ట్స్ శిరీష హత్యకేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్ శివారులోని శంకరపల్లి ప్రగతి రిసార్ట్స్‌లో డిగ్రీ విద్యా ర్థిని శిరీష హత్య కేసు విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు సాయి ప్రసాద్‌ను ప్రశ్నించిన... కొన్ని కీలక విషయాలను రాబట్టారు.

Samayam Telugu 14 May 2018, 2:27 pm
హైదరాబాద్ శివారులోని శంకరపల్లి ప్రగతి రిసార్ట్స్‌లో డిగ్రీ విద్యా ర్థిని శిరీష హత్య కేసు విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు సాయి ప్రసాద్‌ను ప్రశ్నించి కొన్ని కీలక విషయాలను రాబట్టారు. ముందు ఈ కేసులో ఒక్కడే నిందితుడు అనుకున్న పోలీసులు... అతడి కాల్ డేటాను పరిశీలించగా... కొత్త కోణం బయటపడింది. ఈ హత్యకు మరో వ్యక్తి కూడా సహకరించినట్లు తేలింది. సాయి సొంత ఊరైన కొత్తూరు మండలం తిమ్మాపురానికి చెందిన అబ్దుల్ మజీద్‌‌తో నిందితుడు మర్డర్ జరిగిన రోజు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. అతడు కూడా సహకరించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu Sirisha Murder


మజీద్‌ను పోలీసులు ప్రశ్నించగా... హత్య జరిగిన రోజు స్టోరీ మొత్తాన్ని చెప్పేశాడట. శిరీష, సాయి ప్రసాద్‌లను తానే ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. తర్వాత రిసార్ట్స్‌లో హత్య జరగ్గా... సాయి ప్రసాద్ మజీద్‌కు ఫోన్ చేశాడట. ఈ విషయం తెలియగానే అతడు భయంతో అక్కడి నుంచి కారులో పారిపోయాడు. గత గురువారం శిరీష హత్య జరిగింది. నిందితుడు సాయి ప్రసాద్ ఆమెతో మాట్లాడాలి అని చెప్పి శంషాబాద్‌కు రావాలని ఫోన్‌ చేశాడు. ప్రగతి రిసార్ట్స్‌లో ఆన్‌లైన్‌లో కాటేజ్‌ బుక్‌ చేసి ఆమెను నేరుగా రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లాడు. అక్కడ శిరీషను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా... నిరాకరించింది. బాత్రూమ్‌కు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు.
చదవండి.. పెళ్లి ఒప్పుకోలేదనే శిరీష హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.