యాప్నగరం

ప్రణయ్ హత్యకేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్

ప్రణయ్ హత్య కేసులో పోలీసులు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కరీంను అరెస్టు చేశారు.

Samayam Telugu 16 Sep 2018, 4:17 pm
ల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో చోటుచేసుకున్న పరువు హత్య కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కరీం కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌ను హత్య చేసేందుకు కరీం సహకరించినట్లు తెలిసింది.
Samayam Telugu Untitled1


ఈ నేపథ్యంలో పోలీసులు కరీంను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మారుతీరావు, అతని తమ్ముడు శ్రావణ్ కుమార్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న హంతుకులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు బృందాలుగా గాలింపులు జరుపుతున్నారు. కరీంను విచారిస్తే మరిన్ని వివరాలు లభించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: నాన్న.. ప్రణయ్ తల తెమ్మన్నాడు: అమృత
ప్రణయ్‌‌పై అమృత తండ్రికి ఎప్పటి నుంచో కక్ష ఉంది. వారిద్దరూ హైస్కూల్లో చదువుకున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఈ విషయం తెలిసి మారుతీరావు చాలాసార్లు వారిని హెచ్చరించాడు. దీంతో చాలా ఏళ్లు పెద్దలకు తెలియకుండానే ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్‌ వెళ్లి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
Read Also: పగబట్టిన ‘పరువు’.. ప్రణయ్ హత్యకు ఉగ్రవాదితో కుట్ర!
వైశ్య సామాజిక వర్గానికి చెందిన మారుతీరావు.. దళితుడైన ప్రణయ్‌ను వివాహం చేసుకోడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌ వారిని విడదీయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రణయ్‌ని చంపేస్తామంటూ హెచ్చరించారు కూడా. దీంతో వాళ్లు మిర్యాలగూడ వదిలి వెళ్లిపోవాలని భావించారు. అయితే, అమృతకు టైఫాయిడ్ రావడం, అదే సమయంలో ఆమె గర్భవతి కావడంతో ఎక్కడికి వెళ్లలేకపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.