యాప్నగరం

మావోలకు పేలుడు పదార్థాలు.. ఎన్‌జీఆర్‌ఐ ఉద్యోగి అరెస్టు

హైదరాబాద్ వాసి నక్కా వెంకట్రావును జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Samayam Telugu 24 Dec 2018, 4:52 pm
మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఝార్ఖండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు హైదరాబాద్‌‌కు చెందిన నక్కా వెంకట్రావుగా పోలీసులు గుర్తించారు. ఇతడు నగరంలోని ప్రతిష్టాత్మక ‘నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)’లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు విస్తుపోయారు..
Samayam Telugu Jarkhnad


నక్కా వెంకట్రావు 2016, 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులను కలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అర్బన్‌ నక్సలిజం వ్యాప్తి చేయడంలో ఇతడు కీలకపాత్ర పోషిస్తున్నట్లు భావిస్తున్నారు. నగరాల్లో మావోయిస్టుల నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడంలో నక్కా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణ, ఒడిశాతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో మావోల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నక్కా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.