యాప్నగరం

9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

సభ సజావుగా సాగనీయకుండా అడ్డుకుంటున్నారని తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ

Samayam Telugu 19 Dec 2016, 12:08 pm
సభ సజావుగా సాగనీయకుండా అడ్డుకుంటున్నారని తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. వీరిలో గీతారెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంతప్ కుమార్, పద్మావతి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, డీకే అరుణలు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
Samayam Telugu nine congress mlas suspended from assembly in ts
9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్


కాగా, కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ ఏకపక్షంగా సస్పెండ్ చేశారని సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆరోపించారు. నిన్నటి వరకు జరిగిన పార్లమెంటులో కూడా ప్రతిపక్ష సభ్యులను ఇలా సస్పెండ్ చేయలేదని జానా మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం అప్రస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తమ సభ్యులను అనవసరంగా సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ ఎత్తివేయకపోతే నేను కూడా వాకౌట్ చేస్తానని జానా అన్నారు.

అటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను కూడా ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానించింది.

సభలో చర్చలు చేయకుండా రచ్చ చేస్తే సస్పెండ్ చేసి..ప్రజా సమస్యలు చర్చిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. అనవసరంగా సస్పెండ్ చేసే సంప్రదాయం కాంగ్రెస్ దేనని థమది కాదని ఆయన ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.