యాప్నగరం

నిశిత్‌ నారాయణకు కన్నీటి వీడ్కోలు

బాధను దిగమింగుకుని ఆయన కొడుకుకు అంత్యక్రియలు నిర్వహించారు ఏపీ మంత్రి నారాయణ.

TNN 11 May 2017, 11:39 am
ఏపీ మంత్రి నారాయణ ఒక్కగానొక్క కొడుకు, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ నిశిత్ నారాయణ. తనకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కొడుకే అర్థాంతరంగా తనువు చాలించడంతో... తండ్రే కొడుక్కి తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఆ ఉద్విగ్నక్షణాలతో నెల్లూరు గుండె బరువెక్కింది. నెల్లూరులో ఉన్న తెదేపా శ్రేణులతో పాటూ, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు, నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు, విద్యార్థులు అందరూ నిశిత్ అంత్యక్రియలకు తరలివచ్చారు.
Samayam Telugu nishith last rites performed by his father narayana in nellore
నిశిత్‌ నారాయణకు కన్నీటి వీడ్కోలు


ఉదయం 9 గంటలకు నారాయణ మెడికల్ కాలేజీ నుంచి నిశిత్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 11 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. అనంతరం పెన్నానదీ తీరంలోని బోడిగాడి తోట శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. భారీగా జనం తరలి వచ్చారు. తండ్రి నారాయణ కొడుకు చితికి నిప్పంటించారు. అనంతరం విషణ్ణ వదనంతో అక్కడ్నించి కారులో వెళ్లిపోయారు నారాయణ. బాధను దిగమింగుకుని ఆయన కొడుకుకు అంత్యక్రియలు నిర్వహించారు.


బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో జరిగిన కారు ప్రమాదంలో నిశిత్, అతని స్నేహితుడు మరణించారు. బెంజ్ కారును గంటకి 200 కిలోమీటర్ల వేగంతో నడపడంతో అదుపు తప్పి మెట్రో పిల్లర్ ఢీ కొని నుజ్జునుజ్జుయ్యంది. ఈ ఘటన లో నిశిత్, అతని స్నేహితుడు రవివర్మ తీవ్రంగా గాయాలపాలయ్యారు. కనీసం వారిని కారు నుంచి బయటకు తీసేందుకే రెండుగంటలు పట్టింది. అంతగా కారు తునాకతునాకలైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.