యాప్నగరం

పొలంలో... నిజాం కాలంనాటి 'వెండి' నాణేలు లభ్యం...!

వ్యవసాయ పొలంలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన వనపర్తి జిల్లా... ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.

TNN 24 Mar 2018, 1:05 pm
వ్యవసాయ పొలంలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన వనపర్తి జిల్లా... ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.... ఆత్మకూరు మండలం.. కొత్తపల్లి గ్రామంలో.. మిర్యాలగూడకు చెందిన నారాయణరావు అనే వ్యక్తి గతేడాది పొలం కొనుగోలు చేశాడు. పొలంలో కొద్దిమేర కొండప్రాంతం ఉండటంతో.. చదును చేసేందుకు రెండు రోజుల క్రితం పనులు మొదలుపెట్టాడు. పొలాన్ని చదును చేసే క్రమంలో... వెండి నాణేలు దొరికాయి. ఈ విషయం ఎవరికీ పొక్కనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయినా విషయం... దాగదుగా... ఆనోటా.. ఈ నోటా విషయం నానడంతో... గ్రామస్తులు అక్కడికి వెళ్లి మళ్లీ తవ్వకాలు చేపట్టారు. మళ్లీ వారికి కొన్ని నాణేలు లభ్యమయ్యాయి.
Samayam Telugu SILVER Coins


విషయం తెలుసుకున్న...సీఐ శంకర్, తహసీల్దార్ జేకే మోహన్‌ గ్రామాన్ని సందర్శించి... విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పొలాన్ని పరిశీలించిన అధికారులు ... లభించిన వెండి నాణేలు ప్రభుత్వానికి చెందుతాయని... వాటిని వెంటనే స్వాధీనం చేయాల్సిందిగా చాటింపు వేశారు. దీంతో పొలం యజమాని నారాయణరావు నుంచి 10 నాణేలు, మరో వ్యక్తి నుంచి 7 నాణేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలానికి చెందినవాటిగా గుర్తించారు. వీటిని ఉర్దూలో గాడీలు అని... తెలుగులో హాలీలుగా పరిగణిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.