యాప్నగరం

నగదు బంద్: ఏటీఎంల వద్ద అవే క్యూలు

శని, ఆది, సోమ వరసగా ఇలా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. ఏటీఎంలలో సరిపడా నగదు లేదు.

Samayam Telugu 11 Dec 2016, 10:56 am
శని, ఆది, సోమ వరసగా ఇలా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. ఏటీఎంలలో సరిపడా నగదు లేదు. అయినా ఆశ చావని జనం..కనీస ఖర్చుల కోసం వణికించే చలిలోనూ ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి.
Samayam Telugu no change queues continue at atms as bank holidays for three days
నగదు బంద్: ఏటీఎంల వద్ద అవే క్యూలు


ఒకవైపు కేవలం రూ.2వేలు విత్ డ్రా చేసుకోవడానికి సామాన్య జనం నానా తంటాలు పడుతుంటే..బ్యాంకు అధికారులు అవినీతి దురదతో కోటానుకోట్ల రూపాయల కొత్తనోట్లు బడాబాబుల జేబుల్లో దూరిపోతున్నాయి. కమిషన్ల కక్కుర్తికి కొందరు అధికారులు ఆర్బీఐ పంపి డబ్బును జనం కోసం బ్యాంకులు, ఏటీఎంలలో ఉంచాల్సింది పోయి...పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో దాదాపు 80శాతం ఏటీఎంలు ఇంకా మూతపడే ఉన్నాయి.

వీకెండ్ కావడంతో...ఉద్యోగాలు చేసేవారు సైతం తెల్లవారు జాము నుంచే ఏటీఎంల వద్ద బారులు తీరారు.
నవంబర్ 8 అర్థరాత్రి నుంచి పెద్దనోట్లు రూ.1000, రూ.500లు చెల్లవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారు. ఆరోజు నుంచి నేటీ నెలరోజులు దాటినా...పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రూ.2000, రూ.500 నోట్లు వాటికి తోడు చిన్న నోటలు రూ.100, రూ.50, రూ.10లు అధికమొత్తం ముద్రిస్తున్నామని ఆర్బిఐ చెబుతున్నా...అవి సామాన్యులను మాత్రం చేరడం లేదు.

హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఏటీఎంలు చాలావరకు మూతపడే ఉన్నాయి. కొన్నిచోట్ల అప్పటికే ఏటీఎంలో పెట్టిన మనీ విత్ డ్రా చేసుకోవడానికి జనం క్యూలో నిలబడి ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.