యాప్నగరం

నగరంలోకి 'నో ఎంట్రీ'...!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోకి... ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Samayam Telugu 5 Apr 2018, 7:10 pm
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోకి... ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు... రవాణాశాఖ అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించారు. నగరంలోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలకు సూచిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రవేశిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Samayam Telugu BUS


సర్కారు తాజా నిర్ణయంతో విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయివేట్ బస్సులకు ఎల్‌బీ నగర్ వరకే అనుమతి ఉంటుంది. అదే విధంగా... కర్నూలు వైపు నుంచి వచ్చే బస్సులు శివరాంపల్లి (ఆరాంఘర్) వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.