యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం: రక్తపుమడుగులో ఇద్దరు.. ఎవరూ పట్టించుకోని వైనం

రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మృత్యువాత పడుతున్న ఘటనలు ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాల్లోనే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితుల్ని చూసినా ప్రజలు పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోంది.

Samayam Telugu 22 Jul 2018, 4:23 pm
రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మృత్యువాత పడుతున్న ఘటనలు ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాల్లోనే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితుల్ని చూసినా ప్రజలు పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలూ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న వీళ్లిద్దరినీ వాహనదారులు, పాదచారులు చూసుకుంటూ వెళ్లారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. తీవ్ర రక్తస్రావంతో వీళ్లిద్దరూ చనిపోయారు. వీళ్లిద్దరూ తల్లీ కూతుళ్లు కావడం బాధాకరం.
Samayam Telugu Lorry


ఈ ఘటన హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బండరావిరాలకు చెందిన అందెల మల్లమ్మ(75) రెండు రోజుల క్రితం భాగ్యలత కాలనీ సమీపంలోని అరుణోదయ కాలనీలో ఉండే తన కుమార్తె ఎర్రగొల్ల భారతమ్మ(45) ఇంటికి వచ్చింది. మల్లమ్మను తిరిగి స్వగ్రామంలో వదిలివేయడానికి కుమార్తె భారతమ్మ శనివారం ఉదయం బయల్దేరింది. భాగ్యలతకాలనీ బస్టాపు వద్ద వీరిద్దరూ జీబ్రా క్రాసింగ్ మీదుగా రోడ్డు దాటుతుండగా హయత్‌నగర్‌ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఇద్దరూ మృతిచెందారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.