యాప్నగరం

ఆర్కే బీచ్‌లో ప్రదర్శనకు అనుమతి లేదు

జల్లికట్టు వివాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.

TNN 24 Jan 2017, 4:56 pm
జల్లికట్టు వివాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. తమిళ యువత అంతా కలిసి జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ను సాధించినట్టు ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలంటూ కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎవరితో మొదలైందో తెలియదు కానీ... యువతలోకి దూసుకుపోతోంది. జనవరి 26న అందరూ విశాఖపట్నంలోని ఆర్కేబీచ్ లో నిరసన ప్రదర్శన చేద్దామంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీనికి అనేక మంది ఏపీ యువత స్పందిస్తున్నారు. అలాగే సినిమా హీరోలు కూడా ఆ నిరసనకు మద్దతు చెబుతున్నట్టు సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టారు. దీంతో ఎల్లుండి జరగబోయే నిరసన ప్రదర్శనకు భారీగా తరలివస్తారనే అంచనా ఉంది.
Samayam Telugu no permission to ap special status protest at rk beach says ap dgp
ఆర్కే బీచ్‌లో ప్రదర్శనకు అనుమతి లేదు


ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనవరి 26న జరగబోయే నిరసన ప్రదర్శనకు పోలీసుల అనుమతి లేదని చెప్పారు. ఇంతవరకు అనుమతి కావాలంటూ తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ నిర్వాహకులు ఎవరైనా వచ్చి కలిసినా అనుమతి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం ఒక్క రోజు సమయంలో బందోబస్తును ఏర్పాటుచేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ప్రదర్శనల్లో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ప్రదర్శనకు సంబంధించి పెట్టే ట్వీట్లకు ఎవరూ స్పందించవద్దని ఆయన కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.