యాప్నగరం

హైదరాబాద్‌లో రూ.10కే టిఫిన్, రెండు పూటల భోజనం, వసతి

హైదరాబాద్ మహానగరంలో కేవలం పది రూపాయలకే ఉదయం టిఫిన్, రెండు పూటల భోజనం, వసతి సదుపాయాన్ని ఊహించగలమా? కానీ ఓ ట్రస్ట్ అందజేస్తోంది.

Samayam Telugu 16 Jun 2018, 4:48 pm
హైదరాబాద్ మహానగరంలో కేవలం పది రూపాయలకే ఉదయం టిఫిన్, రెండు పూటల భోజనం, వసతి సదుపాయాన్ని ఊహించగలమా? భాగ్యనగరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పట్టణంలోనైనా సరే రోజూ మూడు పూటల ఆహారం, వసతి కావాలంటే కనీసం రూ.500 అయినా ఖర్చు చేయాల్సిందే. కానీ సేవా భారతి ట్రస్ట్ మాత్రం హైదరాబాద్‌లో ఈ అవకాశం కల్పిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల కోసం మానవతా దృక్పథంతో సేవా భారతి ఈ మంచి పని చేస్తోంది.
Samayam Telugu seva bharathi


ఇప్పటి వరకూ రోజూ రెండు పూటల భోజనం, వసతి సదుపాయం కల్పించగా.. ఈ మధ్య నుంచే ఉదయం పూట అల్పాహారం కూడా అందిస్తున్నారు. 2013లో సేవా భారతి ‘గాంధీ’లో సేవలు ఆరంభించింది. అప్పటి గాంధీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్ వినతి మేరకు మూడు నెలల్లోనే పేషెంట్ల బంధువులు ఉండేందుకు వీలుగా ఓ షెల్టర్ నిర్మించారు. కేవలం పది రూపాయలు చెల్లిస్తే చాలు రోజంతా ఇక్కడ ఉండొచ్చు, స్నానం చేయడంతోపాటు భోజనం చేయొచ్చు. ప్రస్తుతం రోజూ 250 మంది సేవా భారతి సేవలను ఉపయోగించుకుంటున్నారు.

సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే తమకు ‘సేవా భారతి’ ఎంతగానో ఉపయోగపడుతోందని పేషెంట్లు, వారి బంధువులు చెబుతున్నారు. ఖరీదైన హోటల్లో ఉండే స్థోమత లేని తమకు నామ మాత్ర ఖర్చుతో వసతి, భోజన సదుపాయం కల్పించడం చాలా ఉపయోగకరంగా ఉందంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.