యాప్నగరం

మధుకర్ భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం

భర్త చావుకు తననే కారణంగా చూపడంతో మనస్తాపం పాలై స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది.

TNN 14 Apr 2017, 12:04 pm
ఎన్నారై మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని భార్య స్వాతి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. నగరంలోని కొత్తపేటలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె గురువారం అర్థరాత్రి ఆత్మహత్యకు యత్నించింది. అందరూ నిద్రపోయాక రసాయనిక ద్రావణం తాగింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. భర్త ఆత్మహత్యకు తననే కారణంగా చూపి అత్తింటి వారు దాడి చేయడం ఆమెను తీవ్రంగా కలచివేసినట్టు తెలుస్తోంది. మానసిక ఆందోళనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈమెకు ఆరేళ్ల పాప శర్మిష్ట ఉంది.
Samayam Telugu nri madhukar reddy wife swathi suicide attempt
మధుకర్ భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం


మధుకర్ రెడ్డికి స్వాతితో ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. కుటుంబంతో కలిసి అమెరికాలోనే నివసిస్తున్నాడు మధుకర్. ఇటీవలే అక్కడ సొంతిల్లు కూడా కొన్నాడు. వారం రోజుల క్రితం తల్లికి క్షమించమ్మా అని మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే మధుకర్ మృతదేహానికి భువనగిరిలోని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. భర్తని చివరి చూపు చూసేందుకు వెళ్లిన స్వాతిపై అత్తింటి వారు దాడి చేసి కొట్టారు. ఆ సంఘటనపై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కావాలని కోరింది.

అలాగే మీడియాతోనూ సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించింది. తన వల్ల భర్త ఆత్మహత్య చేసుకోలేదని ఆర్థిక పరమైన చిక్కులు, మానసిక వేదన వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పింది. తమ మధ్య ఉన్నవి చాలా చిన్న చిన్న సమస్యలేనని తెలిపింది. మధుకర్ తన అన్నకు, అక్కకు కలిపి రూ.70లక్షల దాకా ఇచ్చాడని, దాని వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పింది. ఉద్యోగం పోతుందనే భయం కూడా తనను వెన్నాడేదని తెలిపింది. మానసిక సమస్యలకు చికిత్స కూడా తీసుకోవడం ప్రారంభించాడని... ఆ మందుల చీటీలు చూపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.