యాప్నగరం

ఎన్టీఆరే పిలిచి పిల్లనిచ్చారు: చంద్రబాబు

రాజకీయాల్లో తన ఎదుగుదలను చూసి నందమూరి తారకరామరావే (ఎన్టీఆర్) స్వయంగా కూతురు(భువనేశ్వరి)ని

Samayam Telugu 22 Mar 2017, 1:51 pm
రాజకీయాల్లో తన ఎదుగుదలను చూసి నందమూరి తారకరామరావే (ఎన్టీఆర్) స్వయంగా కూతురు(భువనేశ్వరి)ని పెళ్లి చేసుకోవాలని అడిగారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీలో ఆయన తన వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ntr asked me to marry her daughter says chandrababu naidu
ఎన్టీఆరే పిలిచి పిల్లనిచ్చారు: చంద్రబాబు


తాను సాధారణ కుటుంబానికి చెందిన వాడినని..రాజకీయాల్లో ఒక్కొ మెట్టు ఎదుగిన తీరు ఎన్టీఆర్ ను ఆకర్శించిందని బాబు అన్నారు.

రాజకీయాల్లో తాను బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం గడవడానికి 25ఏళ్ల క్రితమే డెయిరీ స్థాపించానని...బాబు పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ..కుటుంబ బాధ్యత, వ్యాపారానికి తగు సమయం కేటాయించేవాణ్ని అని ఆయన చెప్పారు.

తొలిసారి మంత్రి పదవి దక్కిన తర్వాత డెయిరీ వ్యాపార బాధ్యతను భార్యకు అప్పగించానని చెప్పిన బాబు..24ఏళ్లుగా వ్యాపారాన్ని ఆమె చూసుకుంటున్నారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.