యాప్నగరం

వారికి తెలంగాణపై అభిమానం ఉండాలి: బాబు

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అహర్నిషలు కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి

Samayam Telugu 28 May 2017, 7:51 pm
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అహర్నిషలు కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావుకు భారత రత్న ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖలో జరుగుతున్న మహానాడు వేదికపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సందేశం ప్రజలే దేవుళ్లు అని.. ఆ యుగపురుషుడి ఆశయ సాధనలో, ప్రజాసేవకే పార్టీ అంకితం కావాలని బాబు పిలుపునిచ్చారు. ప్రజలే ముందు అనే మంత్రంతో మనం ముందుకెళ్లాలని సూచించారు.
Samayam Telugu ntr must be honoured with bharata ratna chandrababu
వారికి తెలంగాణపై అభిమానం ఉండాలి: బాబు


‘విజన్ 2022కల్లా ఏపీలో ప్రస్తుతమున్న లక్షా 23వేలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 2లక్షల 95వేల రూపాయలు సాధించేలా కృషి చేస్తాం. 2029కల్లా 9లక్షల 61వేలకు తీసుకెళ్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీని నాలెడ్జ్ గా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. విజన్ 2050కల్లా రాష్ట్రాన్ని అన్నింటా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి మరిన్ని పథకాలు రూపొందిస్తామని చెప్పారు. 8, 9 తరగతి బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రైవేటు యూనివర్సిటీలతో పాటు ప్రపంచ యూనివర్సిటీలను రాష్ట్రానికి తెస్తానన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, కాపు విద్యార్థులతో పాటు అగ్రవర్ణాలకు ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. జూన్ లో నిర్వహించే సంకల్ప దీక్షకు ప్రజలను మమేకం చేయాలని బాబు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ను ఆనందం, ఆరోగ్యం, ఆదాయ రాష్ట్రంగా చేస్తానని బాబు అన్నారు. జన్మభూమిని, కన్నతల్లి మరువరాదని సూచించారు. ‘ ఆ అంటే ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్ పై అభిమానం ఉండాలి. తెలంగాణలో పుట్టిన వ్యక్తులకు తెలంగాణపై అభిమానం ఉండాలి. జన్మభూమికి గౌరవం ఇవ్వాలి. జన్మభూమికి సేవ చేశారు. ఆ అంటే అమరావతి. అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి’ అని చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ 33 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.