యాప్నగరం

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఊమెన్‌ చాందీ

ఏపీలో బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. పార్టీ బలోపేతం కోసం.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ను మార్చింది. కొత్త బాస్‌గా ఊమన్ చాందీని నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 27 May 2018, 3:59 pm
ఏపీలో బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. పార్టీ బలోపేతం కోసం.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ను మార్చింది. కొత్త బాస్‌గా ఊమన్ చాందీని నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈయన కేరళ మాజీ సీఎంకాగా.. హస్తం పార్టీలోనూ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చాందీ ఇకపై ఏపీ వహారాలను చాందీ చూసుకొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి అశోఖ్ గెహ్లాట్ తెలిపారు. ఇప్పటి వరకు ఏపీ బాధ్యతలు చూసిన దిగ్విజయ్ ఎన్నో సేవలు అందించారని ఆయనపై కూడా ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu Ommen Chandi


నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. కొంతకాలంగా ఆయన అంత యాక్టివ్‌గా లేకపోవడంతో మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విభజన తర్వాత కూడా దిగ్విజయ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. తర్వాత తెలంగాణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి.. కుంతియాను నియమించారు. ఇప్పుడు ఏపీ నుంచి కూడా డిగ్గీ రాజాను తొలగించారు. ఏపీ మాత్రమే కాదు.. మరో రెండు మూడు రాష్ట్రాలకు కూడా ఇంఛార్జ్‌లను మార్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.