యాప్నగరం

AP Assembly: కనీస మర్యాదలు పాటించరా.. అయినా సహకరిస్తాం: చంద్రబాబు

స్పీకర్ ఎన్నికపై మాటల యుద్ధం. గతంలో నేను సభానాయకుడిగా ఉన్నప్పుడు స్పీకర్‌ను ఎంపిక చేసిన తర్వాత.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ దగ్గరకు మంత్రుల్ని పంపి ఆయన సంతకం తీసుకుని ఆరోజు నామినేషన్ చేయించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు.

Samayam Telugu 13 Jun 2019, 1:40 pm
ఏపీ అసెంబ్లీ రెండో రోజు హాట్ హాట్‌గా నడుస్తోంది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్పీకర్ ఎన్నికపై ఇరు పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. స్పీకర్ ఎన్నిక విషయంలో అధికారపక్షం సభా సంప్రదాయాలను పాటించలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకోవడం మంచి నిర్ణయం తీసుకున్నారని భావించానని.. తమను అడిగితే పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదన్నారు.
Samayam Telugu chandrababu


గతంలో తాను సభానాయకుడిగా ఉన్నప్పుడు స్పీకర్‌ను ఎంపిక చేసిన తర్వాత.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ దగ్గరకు మంత్రుల్ని పంపి ఆయన సంతకం తీసుకుని ఆరోజు నామినేషన్ చేయించ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. స్పీకర్ ఎంపికపై తమకు సమాచారం ఇస్తారని చూశామని.. కానీ కనీసం ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. ఇవాళ కూడా సభకు వచ్చినప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదన్నారు.

ముఖ్యమంత్రిగా సభా గౌరవాన్ని పాటించలేదని.. ఇష్టమైతే రండి, లేకపోతే లేదన్నట్లు వ్యవహరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు ఏమనుకుంటారన్నది ఆలోచన చేయలదేని.. ఈ విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెబుతున్నానన్నారు. తామెప్పుడూ ఏక పక్షంగా చేయలేదని.. సభా సంప్రదాయాలు ఉంటాయి.. వాటిని వైసీపీ పాటించలేదన్నారు. అయినా సరే సభకు పూర్తిగా సహకరిస్తామన్నారు బాబు.

చంద్రబాబు వ్యాఖ్యాలకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలకు అబద్ధాలు చెప్పడం అలవాటేనన్నారు. గతంలో టీడీపీ పాటించని సాంప్రదాయాలను.. మమ్మల్ని పాటించాలని చెప్పడమేంటన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.