యాప్నగరం

రాష్ట్రపతి రాక: వైభవంగా ఓయూ వేడుకలు

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

TNN 26 Apr 2017, 12:56 pm
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కణ్నించి నేరుగా ఓయూకు వచ్చారు రాష్ట్రపతి. జ్యోతి ప్రజ్వలన చేసి శతాబ్ధి వేడుకలను ప్రారంభించారు. శతాబ్ధి పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం మొదలైంది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రస్తుత విద్యార్థులు హాజరయ్యారు. వేదికపై రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఉస్మానియా వీసీ రామచంద్రం, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేదికపై కూర్చున్నారు.
Samayam Telugu ou centenary celebrations inaugurated by president pranab mukherjee
రాష్ట్రపతి రాక: వైభవంగా ఓయూ వేడుకలు


రాష్ట్రపతి శతాబ్ధి ఉత్సవాలనుద్దేశించి మాట్లాడారు. ఈ వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఉస్మానియా అత్యున్నతమైన యూనివర్సిటీల్లో ఒకటని కొనియాడారు. ప్రపంచంలోనే ఉస్మానియాకు మంచి గుర్తింపు ఉందని చెప్పారు. ఈ వందేళ్లలో యూనివర్సిటీలలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఆయన ఇంకా కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.