యాప్నగరం

విద్యాసంస్థల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపు

బుధవారం టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థి నేతల అరెస్టులను నిరసిస్తూ రేపు (గురువారం)

Samayam Telugu 22 Feb 2017, 5:06 pm
బుధవారం టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థి నేతల అరెస్టులను నిరసిస్తూ రేపు (గురువారం) ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీ (ఓయూజేఏసీ) తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ ను బుధవారం ఉదయం తెల్లవారు జామున ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించారు.
Samayam Telugu oujac calls bandh for tomorrow over arrests of unemployed rally
విద్యాసంస్థల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపు


ప్రజాస్వామ్యబద్ధంగా టీజేఏసీ నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు అరెస్టు చేశారని జేఏసీ నేతలు ఆరోపించారు. బుధవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు దాకా నిరుద్యోగ ర్యాలీకి టీజేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ర్యాలీ వల్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటాయని హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయినా టీజేఏసీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసింది.

దీంతో తెలంగాణవ్యాప్తంగా ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్న జేఏసీ నేతలు, నిరుద్యోగులు, విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అటువైపు ఎవరినీ రానీయకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.