యాప్నగరం

'థర్డ్ ఫ్రంట్'ను స్వాగతించిన మజ్లిస్ అధినేత ఒవైసీ

2019 సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు థర్డ్ ఫ్రంట్ కు ఏర్పాటు దిశగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

TNN & Agencies 4 Mar 2018, 5:33 pm
2019 సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు థర్డ్ ఫ్రంట్ కు ఏర్పాటు దిశగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ సీఎం ప్రకటనను స్వాగతించారు. ఒవైసీ ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతూ.. దేశంలోని ప్రజలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో విసుగు చెందారని అన్నారు.
Samayam Telugu owaisi seconds telangana cheif call for third front
'థర్డ్ ఫ్రంట్'ను స్వాగతించిన మజ్లిస్ అధినేత ఒవైసీ


'నేను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నా. దేశంలోని ప్రజలు బీజేపీ పరిపాలనతో విసిగిపోతున్నారు. కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయం కాదు' అని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలకు ఆశించినంత మేలు జరగలేదని చెప్పారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను ప్రశంసించారు. 'గత నాలుగు సంవత్సరాల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి పాలనను అందించారు' అని కితాబిచ్చారు.


శనివారం కేసీఆర్, జాతీయ రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తిని బయటకి చెప్పారు. భారత రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో వెళ్ళడానికి నేను సిద్ధమే. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం రావాలి. ఫ్రంట్, కూటమిపై ఆలోచన జరగాలి. థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలనన్నారు.

'జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 70 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య పాలనలో గుణాత్మకమైన మార్పులేవీ రాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు మార్పును చూడాలనుకుంటున్నారు. బీజేపీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే ఏదైనా కొత్తగా జరిగే అవకాశముంది' అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.