యాప్నగరం

టి.కాంగ్రెస్ ఏకగ్రీవం ఆశలకు గండి

ఖమ్మం: పాలేరు ఉపపోరులో తమ అభ్యర్ధిని ఏకగ్రీవం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ఆశలు అడిఆశలయ్యాయి.

TNN 21 Apr 2016, 1:10 pm
ఖమ్మం జిల్లా పాలేరు ఉపపోరులో తమ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలన్న కాంగ్రెస్ ఆశలకు గడిపడింది. ఏకగ్రీవం కోసం అన్ని పార్టీల నేతలతో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయాత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి కమ్యునిష్టులతో కలిసైనా ఉమ్మడి అభ్యర్ధిగా ప్రకటించాని టి.కాంగ్రెస్ భావించింది. దీనికి వామపక్ష పార్టీలు కూడా తిరస్కరించాయి. దీంతో ఇక చేసేది ఏమీ లేక ఒంటరి పోరుకు సిధ్దమైంది టి.కాంగ్రెస్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ అకస్మాత్తుగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉప పోరు అనివార్యమైంది.
Samayam Telugu paleru by election update
టి.కాంగ్రెస్ ఏకగ్రీవం ఆశలకు గండి


ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఉపపోరు కోసం టీఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి తమ్మల పేరును ప్రకటించారు. మరోవైపు టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని భావిస్తున్నాయి. టీడీపీ మాత్రం నామా అభ్యర్ధిత్వాన్ని బీజేపీ ముందు ఉంచింది. అయితే ఇరు పార్టీల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.