యాప్నగరం

వైఎస్సార్సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి..?

నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ,

TNN 31 Jan 2018, 5:10 pm
నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికరమైన రాజకీయ ఊహాగానాలు రేగుతున్నాయి. పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి ఇద్దరు ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే మాట వినిపిస్తోందిప్పుడు. వాళ్లిద్దరూ మరెవరో కాదు.. భార్యభర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు.. పనబాక లక్ష్మీ, పనబాక కృష్ణ‌య్య.
Samayam Telugu panabaka family to join ysrcp
వైఎస్సార్సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి..?


వీరిలో పనబాక లక్ష్మీ కేంద్ర మాజీ మంత్రి కూడా. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆమె జౌళీ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో వీరి పని ఖాళీ అయిపోయింది. ఇప్పుడప్పుడే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వీరు వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. పనబాక లక్ష్మీ గతంలో కాంగ్రెస్ తరఫు నుంచి బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేశారు.

ఇదే టికెట్ మళ్లీ ఇస్తామనే హామీతో ఆమె వైకాపాలో చేరబోతున్నట్టుగా సమాచారం. అలాగే ఆమె భర్త కృష్ణ‌య్యకు నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం టికెట్ ను ఆఫర్ చేస్తున్నారట వైకాపా వాళ్లు. అది రిజర్వ్డ్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన సునీల్ వైకాపా తరఫున గెలిచి, తెలుగుదేశంలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కఈష్ణయ్యను బరిలోకి దింపడానికి వైకాపా అధినేత సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్నంతలోనే పనబాక దంపతులు వైకాపాలో చేరతారనే మాట వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.