యాప్నగరం

బహిష్కరణ వేటు: హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద

నగరం నుంచి పోలీసులు బహిష్కరణ వేటు వేయడంపై పరిపూర్ణానంద స్వామి బుధవారం (జులై 11) హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్నిసవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు.

Samayam Telugu 11 Jul 2018, 5:41 pm
నగరం నుంచి పోలీసులు బహిష్కరణ వేటు వేయడంపై పరిపూర్ణానంద స్వామి బుధవారం (జులై 11) హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను రాష్ట్ర పోలీస్ శాఖ విస్మరిస్తుందని పిటిషన్‌లో తెలిపారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా అదేశాలు జారీచేయాలని స్వామిజీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా పోలీస్ శాఖకు అదేశాలు ఇవ్వాలని పరిపూర్ణనంద స్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu swamy


శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. రెండు రోజుల క్రితం పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్ధమయ్యారు. అయితే యాత్రను పోలీసులు అడ్డుకొని.. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. గత మూడు రోజులుగా ఆయన నిర్బంధంలోనే ఉన్నారు. రెండు రోజుల క్రితం కత్తి మహేశ్‌ను నగర బహిష్కరణ చేయగా.. ఇవాళ పరిపూర్ణానందను కూడా బహిష్కరించారు. హౌస్ అరెస్ట్‌లో ఉన్న ఆయనకు నోటీసులు అందజేసి.. వేకువజామున సిటీ నుంచి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.