యాప్నగరం

కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి గురించి పవన్ ఏమన్నారు ?

రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కి సినీనటుడు, జనసేన పార్టీ అధినేత...

TNN 20 Jul 2017, 10:57 pm
రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కి సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. దళిత బిడ్డ, విద్యా కోవీదుడు అయిన రామ్ నాథ్ కోవింద్ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతికి ఎన్నికవడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించింది అని ఆనందం వ్యక్తంచేశారు పవన్.
Samayam Telugu pawan kalyan congratulates president elect ram nath kovind
కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి గురించి పవన్ ఏమన్నారు ?


'భారత దేశం వివిధ జాతులు, మతాల సమాహారం. ఇటువంటి సాంఘీక జీవన వైవిద్యం మరే ఇతర దేశంలోనూ కనిపించదు. ఇంతటి వైవిద్యంలోనూ మనమంతా ఏకంగా కలిసిమెలిసి వుండటమే మన గొప్పతనం' అని అభిప్రాయపడిన పవన్... దేశంలోని అట్టడుగువర్గాల వారికి ఉన్నతస్థాయి పదవులు దక్కినప్పుడే ఈ సంఘటిత శక్తి వర్థిల్లుతుంది అని అన్నారు.

ఓ నిమ్నజాతిలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఐఏఎస్‌కి ఎంపికైనప్పటికీ, చివరకు న్యాయవాద వృత్తి వైపే మొగ్గుచూపారు రామ్ నాథ్ కోవింద్. అంతేకాకుండా అంబేద్కర్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి, రాజ్యాంగానికి మరింత వన్నె తీసుకువస్తారని ఆశిస్తున్నాను అని తన సందేశంలో పేర్కొన్నారు పవన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.