యాప్నగరం

బాబుపై పవన్ ఎప్పుడైనా విమర్శలు చేసుకోవచ్చు!

విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయివేటీకరణను నిరసిస్తూ ఆ సంస్ధ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

TNN 17 Dec 2017, 12:53 pm
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఇటీవల తన పర్యటనలో సీఎం చంద్రబాబును ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వారికుంటాయని, ముఖ్యమంత్రిని విమర్శించే స్వేచ్ఛ పవన్‌కు ఉందని ఆమె అన్నారు. సమస్య మీద పోరాడుతాను అన్న పవన్ వ్యాఖ్యలు హర్షణీయమని అన్నారు. రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత సామాజిక సమస్యలపై స్పందించడం బాధ్యతని, ఆయన ఉద్దేశాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఎన్ని ఉన్నా అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో 2019 ఎన్నికలే నిర్ణయిస్తాయని ఆమె అన్నారు.
Samayam Telugu pawan kalyan free to criticise chandrababu tdp mla
బాబుపై పవన్ ఎప్పుడైనా విమర్శలు చేసుకోవచ్చు!


తన దృష్టికి వచ్చిన సమస్యలపై పవన్ ప్రస్తావిస్తే, సీఎం వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారని ఆమె తెలిపారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించడంతో సీఎం దీనికి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారని అనిత వెల్లడించారు. అలాగే ప్రస్తుతం విపక్షం తన పాత్రను పూర్తిగా మరిచిపోయిందని, ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిక దానికి లేదని ఎద్దేవా చేశారు. కేవలం సీఎం కుర్చీ మాత్రమే వారి లక్ష్యమని, త్వరలోనే ఆ పార్టీ కనుమరుగు కానుందని అనిత జోస్యం చెప్పారు. సమస్యపై పవన్ మాట్లాడితే దాని పరిష్కారం కోసం సీఎం స్పందించి చర్యలు తీసుకుంటే విమర్శించడం తగదని ఆమె హితవు పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.