యాప్నగరం

పవన్ కళ్యాణ్ ఎవరో ఏంటో తెలీదు.. సంతోషం!

‘అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలీదు.. సంతోషం’ ఈ మాటలన్నది ఎవరో కాదు.

TNN 6 Oct 2017, 12:30 pm
‘అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలీదు.. సంతోషం’ ఈ మాటలన్నది ఎవరో కాదు. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్న పదాలు. అప్పుడెప్పుడో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణా ఆయనెవరో నాకు తెలీదు అన్నారు. అప్పుడే దీనిపై చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగారికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇంకో మంత్రి గారు పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన పోటీలోనే లేదని.. టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ అని అన్నారు.
Samayam Telugu pawan kalyan happy to say ashok gajapathi raju minister pithani dont knows him
పవన్ కళ్యాణ్ ఎవరో ఏంటో తెలీదు.. సంతోషం!


వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ పవన్ కళ్యాణ్‌పై, ఆయన పార్టీ జనసేనపై గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు పార్టీ పెట్టలేదని, జెండా కట్టిన పాపాన పోలేదని పితాని వ్యాఖ్యానించారు. బయటకు రాకుండా సమస్యలమీద మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జనసేన జెండా పట్టుకున్న కార్యకర్తను గానీ, నాయకుడిని కానీ చూడలేదన్నారు. పార్టీ నిర్మాణమే లేనప్పుడు జనసేన గెలుస్తుందని ఎలా అనుకుంటున్నారని పితాని విలేకరులను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ అని జోష్యం చెప్పారు. ఇంతవరకు కార్యకర్తలు, నాయకులతో నిర్మాణబద్ధమైన కార్యక్రమమే తలపెట్టలేదన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగితే అప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచిస్తామని, మాట్లాడతామని పితాని చెప్పారు. అసలు పవన్ గురించి మాట్లాడే సమయం తనకు లేదని హేళనగా అన్నారు.

పితాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. గతంలో పవన్ ఎవరో తెలియదన్న అశోక్ గజపతి రాజు పేరును కూడా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్‌ను బట్టి చూస్తుంటే పితాని మాటలను ఆయన సీరియస్‌గానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా తన ట్వీట్‌తో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా హెచ్చరికలు పంపినట్లయింది. వాస్తవానికి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మాతోనే టీడీపీ గెలిచిందని ఆయన అభిమానులతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. కొంత మంది ఇప్పటికే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌ని తక్కువ చేయడానికే అధికార పార్టీ నాయకులు ఇలాంటి విమర్శలు చేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Ashok Gajapathi Raju Gariki Pawan kalyan evaro telliyudu Manthri Pithani gariki Pawan Kalyan ento telyudu.. SANTHOSHAM... — Pawan Kalyan (@PawanKalyan) October 6, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.