యాప్నగరం

జనసేన ‘దేశ్ బచావో’ నాలుగు పాటలివే!

జనసేన పార్టీ రూపొందించిన ‘దేశ్‌ బచావో’ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నాలుగు పాటలు విడుదల చేశారు.

Samayam Telugu 25 Jan 2017, 8:19 am
జనసేన పార్టీ రూపొందించిన ‘దేశ్‌ బచావో’ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నాలుగు పాటలు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి 45 నిమిషాలకు ఒకటి చొప్పున.. మొత్తం నాలుగు పాటలను పార్టీ యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేశారు. పవన్‌ నటించిన ‘తమ్ముడు’ చిత్రంలోని ‘ట్రావెలింగ్‌ సోల్జర్‌’, ‘జానీ’ చిత్రంలోని ‘నారాజు..’, ‘ఖుషీ’ చిత్రంలోని ‘యే మేరా..’, ‘గుడుంబా శంకర్‌’లోని ‘లే..లే..’ పాటలను రీమిక్స్‌ చేసి ఈ నాలుగు పాటలను రూపొందించారు. పాట మధ్యలో కొన్ని డైలాగ్స్‌ వినపడుతున్నాయి. ఈ ఆల్బమ్‌ పాటలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. డీజే పృథ్వీ ఈ పాటలను మిక్స్‌ చేశారు.
Samayam Telugu pawan kalyan jana sena releases four songs of desh bacho album
జనసేన ‘దేశ్ బచావో’ నాలుగు పాటలివే!


జల్లికట్టు ఉద్యమ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని పవన్ యువతను సన్నద్ధం చేస్తున్నారు.







తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.