యాప్నగరం

తెలంగాణ, ఏపీలో సమరం.. 60% సీట్లు వారికే: పవన్

జనసేన పార్టీ స్థాపించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్...

Samayam Telugu 14 Mar 2017, 4:40 pm
జనసేన పార్టీ స్థాపించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ వెబ్‌సైట్‌ని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ మూడేళ్ల కాలంలో పార్టీకి అండగా వున్న అభిమానులు, మద్దతుదారులకి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తిస్థాయిలో పోటీలో నిలుస్తుందని ఈ సందర్భంగా పవన్ స్పష్టంచేశారు.
Samayam Telugu pawan kalyan press meet on janasena partys third anniversary
తెలంగాణ, ఏపీలో సమరం.. 60% సీట్లు వారికే: పవన్


రానున్న ఎన్నికల్లో యువ నాయత్వానికే తొలి ప్రాధాన్యత కల్పిస్తూ 60శాతం సీట్లు వారికే కేటాయించడం జరుగుతుంది. అయితే, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజల నమ్మకాల్ని ముందుకు తీసుకెళ్లే సరైన యువనాయకత్వం కోసమే పార్టీ ఎదురుచూస్తోంది. జూన్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత పొత్తులపై ఆలోచిస్తాం అని తెలిపారు పవన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పిన పవన్.. పార్టీ ఓడినా, గెలిచినా ప్రజా సమస్యలపై పోరాటం కోసం పార్టీ కొనసాగుతుంది అని తేల్చిచెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.