యాప్నగరం

మంత్రిపై వస్తున్న ఆరోపణలపై పవన్ ఏమన్నారో తెలుసా ?

విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్‌ని విలేకరులు ఓ ప్రశ్న అడిగారు.

Samayam Telugu 30 Mar 2017, 1:18 pm
విజయవాడలో హోటల్ గేట్ వే నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం బయల్దేరడానికిముందుగా అక్కడున్న మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్‌ని విలేకరులు ఓ ప్రశ్న అడిగారు. ఆగ్రిగోల్డ్ కుంభకోణంలో మంత్రులకి కూడా భాగస్వామ్యం వుందని, ముఖ్యంగా మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కదా.. దీనిపై మీరు ఏమని స్పందిస్తారు అని అడిగారు అక్కడున్న విలేకరులు.
Samayam Telugu pawan kalyan reacts to allegations on ministers in agrigold issue
మంత్రిపై వస్తున్న ఆరోపణలపై పవన్ ఏమన్నారో తెలుసా ?


మీడియా అడిగిన ఈ ప్రశ్నకి ఎప్పటిలాగే స్పందించిన పవన్ కల్యాణ్... "అధికారంలో వున్న నేతలపై ఆరోపణలు రావడం సహజం. అందుకే ముందుగా నేను బాధితులతో మాట్లాడి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటాను. నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే ఈ వ్యవహారంలో మంత్రులు, ప్రభుత్వం తీరుపై స్పందిస్తాను" అని సెలవిచ్చారు పవన్.

'సహారా కేసులో బాధితులకి న్యాయం చేయడానికి సుప్రీం కోర్టు సుబ్రతోరాయ్‌కి వీలు కల్పించింది. సత్యం కుంభకోణం కేసులోనూ కోర్టు బాధితులకి న్యాయం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆగ్రిగోల్డ్ కేసులోనే ఆశించినంత స్థాయిలో పారదర్శకత కొరవడిందని అనిపిస్తోంది' అని అన్నారు పవన్. మరి ఈ విషయంపై మీరు ప్రభుత్వంతో మాట్లాడతారా అని అడగ్గా... మొదటిగా బాధితుల సమస్యలు ఏంటో తెలుసుకున్న తర్వాత అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడతానా లేదా అనేది చెబుతానన్నారు పవన్. ఆగ్రిగోల్డ్‌కి అప్పులకన్నా ఆస్తులే ఎక్కువున్నప్పుడు బాధితులకి ఎందుకు న్యాయం జరగడం లేదనేదే అర్థం కాని ప్రశ్న అని అసహనం వ్యక్తంచేశారు పవన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.