యాప్నగరం

Che Guevara: నేడు చెగువేరా వర్ధంతి.. విప్లవ నేతను గుర్తుచేసుకున్న పవన్

ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అసమానతలు తొలిగిపోవాలని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తన విప్లవ మేదస్సుతో అగ్రరాజులను తొక్కిపెట్టిన విప్లవజ్యోతి చెగువేరా.

Samayam Telugu 9 Oct 2018, 10:34 am
చెగువేరా.. ఈ పేరు తెలియనివారుండరు. చెగువేరా గురించి తెలియకపోయినా ఆయన రూపం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. ఆయనొక ‘టీన్ ఐడల్’. యువత ధరించే టీషర్టులపైనా, మోటార్ సైకిళ్లపైనా, ఇంట్లో గోడలపైనా ఇలా చెగువేరా ఫొటోలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇలా చెగువేరా ఫొటోలను పెట్టుకునే చాలా మందికి ఆయన గురించి తెలీదు. కానీ, ఆయన ముఖం చూస్తూనే ఏదో తెలయని ఉత్తేజం మనలో కలుగుతుంది. అందుకే ప్రస్తుత కార్పోరేట్ కల్చర్ చొరబడిన అత్యుత్తమ వ్యాపార వస్తువుగా మారిపోయారాయన. ఆయన అర్జెంటీనా మార్క్సిస్ట్ నేత అని, క్యూబా విముక్తి పోరాటంలో కీలకపాత్ర పోషించిన విప్లవకారుడని కొంత మందికే తెలుసు. ముఖ్యంగా యువత ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Samayam Telugu CheGuevara


ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అసమానతలు తొలిగిపోవాలని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తన విప్లవ మేదస్సుతో అగ్రరాజులను తొక్కిపెట్టిన విప్లవజ్యోతి చెగువేరా. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు విముక్తి కోసం పోరాడిన యోధుడు. పిన్న వయసులోనే అనేక బాధ్యతాయుతమైన పదవులు చేపట్టిన గొప్పనేత. బొలీవియా విముక్తి కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన త్యాగమూర్తి. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చెగువేరాను.. 1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ని ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు.

చెగువేరా జీవితం గురించి తెలిసిన చాలా మంది ఆయన ఆశయాలు, ఆదర్శాలకు ఆకర్షితులవుతారు. అలాంటి వారిలో జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు నుంచే సినిమాల్లో చెగువేరా బొమ్మను పెట్టుకున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రయాణం కూడా చెగువేరా స్ఫూర్తితో నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. పవన్ మాట్లాడే విధానం, ఆయన హావభావాలపై చెగువేరా ప్రభావం ఉంటుందని చాలా మంది అంటుంటారు. ఇదిలా ఉంటే, నేడు చెగువేరా వర్ధంతిని పురష్కరించుకుని ఆ మహాయోధుడిని పవన్ గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ట్వీట్ చేశారు.

‘అసమానత, అణచివేత, దౌర్జన్యం ఇవన్నీ ఈ ప్రపంచంలో ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ‘చె’ పోరాట స్ఫూర్తి ఇంకా ఉనికిలో ఉంది. ‘చె’ తుదిశ్వాస విడిచిన ఈ రోజున ఒకసారి గుర్తుచేసుకుందాం’ అని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.