యాప్నగరం

జగన్‌కు అందుకే మద్దతివ్వలేదు, నాయకుడికి కులాల భావన ఉండొద్దు: పవన్ కల్యాణ్

గత ఎన్నికల్లో జగన్‌కు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమదే. చంద్రబాబు రాజధానిలో కులాల ఇబ్బందులను అధిగమించాలి.

TNN 8 Dec 2017, 4:10 pm
విజయవాడలో జనసేన కార్యకర్తలో భేటి అయిన పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో జగన్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయానో తెలిపారు. మన దగ్గర కులాల కొట్లాటలు ఇప్పటికీ తగ్గలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కులాల మధ్య ఐక్యత సాధిస్తేనే బ్రహ్మాండమైన రాజధాని ఏర్పాటు సాధ్యమని భావించానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో జగన్‌పై అభియోగాలు, కేసులు లేకపోతే ఆయనకు మద్దతు ఇవ్వలేకపోయా. గతంలో పరిటాల రవి విషయంలో ఇబ్బంది పెట్టినప్పటికీ, టీడీపీకి మద్దతు ప్రకటించానని పవన్ చెప్పారు.
Samayam Telugu pawan kalyan reveals why he was not supported ys jagan in 2014 elections
జగన్‌కు అందుకే మద్దతివ్వలేదు, నాయకుడికి కులాల భావన ఉండొద్దు: పవన్ కల్యాణ్


రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసమే నాకు అవమానం జరిగినా మనసులో పెట్టుకోకుండా తెలుగు దేశానికి మద్దతునిచ్చా. దేశ సుభిక్షత కోసం కులాలను దాటి వెళ్లండని పవన్ అభిమానులకు పిలుపునిచ్చాడు. నాకు కులాలతో సంబంధం లేదు. అందరూ నా భావజాలాన్ని అర్థం చేసుకునే ఇక్కడికి వచ్చారని భావిస్తున్నానని పవన్ చెప్పారు.

హైదరాబాద్ విభిన్న సంస్కృతులకు నిలయం. అక్కడెవరూ నీ కులమేంటని అడగరు. చంద్రబాబు భాగ్యనగరాన్ని బాగానే అభివృద్ధి చేశారు. కానీ అలాంటి పరిస్థితులు అమరావతిలో లేవు. కులాల మధ్య గొడవలుంటాయి. ఈ ఇబ్బందులను దాటాలని జనసేనాని చంద్ర బాబుకి సూచించారు. నాయకుడికి కులాల భావన ఉండకూడదు. నాకు కులమే కాదు, కుటుంబ భావన కూడా లేదు. నాకు కులాల ఐక్యత ఉన్న అమరావతి కావాలి. అప్పుడే జనసేన ఆశయాలు నెరవేరుతాయని పవన్ ఉద్వేగంగా ప్రసంగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.