యాప్నగరం

పవన్ సినిమాలకు గుడ్ బై చెబితే..? నెటిజన్ల స్పందనేంటి?

​ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. అదే జరిగితే ఆయన దాదాపుగా సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లే. మరి నెటిజన్లు ఏమంటున్నారు?

TNN 18 May 2017, 7:02 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నందున.. అంత కంటే ముందుగానే అంటే వచ్చే ఏడాది ఆరంభం నుంచే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. 2014లోనే జనసేన పార్టీని స్థాపించిన పవన్.. ఆ ఎన్నికల్లో బరిలో దిగకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతునిచ్చారు. దీంతో చంద్రబాబు దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు.. పవన్ రాజకీయ రంగ ప్రవేశం గురించి, ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పే విషయమై నెటిజన్లు ఏమనుకుంటున్నారో ‘సమయం’ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
Samayam Telugu pawan kalyan should not quit from cinemas for politics
పవన్ సినిమాలకు గుడ్ బై చెబితే..? నెటిజన్ల స్పందనేంటి?


ఫేస్‌బుక్ లైవ్ పోల్ ద్వారా నెటిజన్ల నాడి పట్టే ప్రయత్నం చేసింది. వెయ్యి మందికిపైగా లైక్‌లు, కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరిలో చాలా మంది పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ సినిమాలు కూడా చేయాలని కోరారు. 40 శాతం మందికి పైగా పవర్ స్టార్ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని, సినిమాలను మానేసినా ఫర్వాలేదని సూచించారు. కాగా.. కామెంట్ల రూపంలో చాలా మంది మాత్రం పవన్‌ రాజకీయ రొంపిలోకి దిగకపోవడమే బెటరని అభిప్రాయపడ్డారు. కొందరు నెటిజన్లు మాత్రం పవన్ ఆదర్శ రాజకీయాలు చేస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి విషయంలో జరిగినట్లుగా కాకుండా చూసుకోవాలని కొందరు సూచించారు. ఎక్కువ మందైతే పవన్ సినిమాలకు దూరం కావొద్దని కోరుకుంటున్నారు. చూద్దాం.. మరి జనసేనాధిపతి ఏం చేయనున్నారో..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.