యాప్నగరం

తెలంగాణపై కేంద్రానికి ఎందుకంత వివక్ష: పవన్

తెలుగు రాష్ట్రాల్లోని రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని జనసేన పార్టీ ఆరోపించింది.

TNN 5 May 2017, 6:30 pm
తెలుగు రాష్ట్రాల్లోని రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని జనసేన పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరిట ఓ ప్రెస్ నోట్‌ను జనసేన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 88300 మెట్రిక్ టన్నుల మిర్చిని కొంటున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో 33700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబని జనసేన ప్రశ్నించింది. తెలంగాణ రైతుల వద్ద ఇంకా లక్షల టన్నుల మిర్చి ఉందన్న సంగతిని పాలకులు గుర్తించాలని మండిపడింది.
Samayam Telugu pawan kalyan slams nda government over mirchi issue
తెలంగాణపై కేంద్రానికి ఎందుకంత వివక్ష: పవన్


రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని, తెలుగు ప్రజల మధ్య తగవులు పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వానికి జనసేన విజ్ఞప్తి చేసింది. అలాగే మిర్చికి మద్దతు ధరగా రూ. 5వేలను కేంద్ర ప్రకటించడం శోచనీయమని, రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని జనసేన వెల్లడించింది. పారిశ్రామికవేత్తలకు కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో సబ్సిడీలుగా అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వాలు.. రైతులు కుంగిపోతున్నా కరుణ చూపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మద్దతు ధరను పెంచి, తెలంగాణలోనూ 88300 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని జనసేన డిమాండ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.