యాప్నగరం

నిరాయుధుడైన రంగా హత్య తప్పు: పవన్ కల్యాణ్

వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఆయన హత్య తప్పు. కానీ ఆ తర్వాత దానికి సంబంధం లేని వాళ్లు ఇబ్బందులు పడ్డారు.

TNN 8 Dec 2017, 3:40 pm
మూడు రోజుల పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడలో నిర్వహించిన సభలో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో ముఖ్యంగా, విజయవాడలో సామాజిక వర్గాల మధ్యనున్న ఆధిపత్య పోరు గురించి పవన్ ఆకట్టుకునేలా మాట్లాడారు. వంగవీటి రంగా గురించి మాట్లాడకుండా.. విజయవాడ రాజకీయాలను మార్చాలి. నిరాయుధుడిగా ఉన్న ఆయన హత్య ఒక తప్పయితే.. ఆయన హత్యతో సంబంధం లేని కుటుంబాలెన్నో నలిగిపోయాయి. అందులో కమ్మ, కాపు, అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. హత్యల పర్యావసానం చాలా బాధను కలిగిస్తుందని పవన్ తెలిపారు.
Samayam Telugu pawan kalyan speaks about vangaveeti ranga murder
నిరాయుధుడైన రంగా హత్య తప్పు: పవన్ కల్యాణ్


నేను నెల్లూరులో పెరిగాను. అక్కడ నా కులమేంటని నన్నెవరూ అడగలేదు. హైదరాబాద్‌లో ఉంటున్నా. అక్కడెవరూ నా కులం అడగలేదు. కానీ ఈ రోజుకీ, ఇంకా విజయవాడ మారలేదు. మనందరం ఆలోచించాలి. హైదరాబాద్ నుంచి ఇక్కడ సెటిల్ కావడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆరు నెలలు ఉండి వెళ్లిపోయాడు. ఇక్కడ నా కులమేంటని అడుగుతున్నారని ఆయన వాపోయారని పవన్ చెప్పాడు. అభివృద్ధి చెందినా.. కులం ఉచ్చులోనే విజయవాడ చిక్కుకుపోయిందన్నారు.

వంగ వీటి రంగా హత్య సమయంలో ఉన్నదీ తెలుగు దేశం ప్రభుత్వమే. ఆయన హత్య తర్వాత మిగతా కులాల వాళ్లు కమ్మ వాళ్లపై దాడి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కులాల అంతరాన్ని అధిగమించాలి. ప్రపంచ స్థాయి రాజధాని కోసమే టీడీపీకి మద్దతునిచ్చానని పవన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.