యాప్నగరం

Pawan Kalyan TV Channel: పవన్ కొత్త టీవీ ఛానెల్? డీటేల్స్ ఇవే!

జనసేనకు అండగా నిలవడం కోసం పవన్ కల్యాణ్‌ సన్నిహితుడు కొత్తగా ఓ న్యూస్ ఛానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 21 Apr 2018, 1:59 pm
రాజకీయానికి, పాత్రికేయానికి మధ్యనున్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. ఏపీ, తమిళనాడు.. రాష్ట్రం ఏదైనా ప్రతి రాజకీయ పార్టీకి న్యూస్ ఛానెళ్ల అండ ఉంది. కుదిరితే పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ఛానెళ్లను నిర్వహించడం లేదంటే.. పార్టీలకు మద్దతుగా ఓ వర్గం మీడియా ఉండటం అనేది తెలుగు నాట మనమంతా చూస్తున్నదే. అధికార టీడీపీకి టీవీ9, టీవీ5, ఏబీఎన్ లాంటి ఛానెళ్లు సాయం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ ఇటీవలే విమర్శించారు. ఇక విపక్ష వైసీపీకి సొంతంగా సాక్షి పత్రిక, ఛానెల్ ఉన్నాయి.
Samayam Telugu pk channel


శ్రీరెడ్డి వ్యవహారంలో తీవ్ర మనస్థాపం చెందిన పవన్ కల్యాణ్.. మీడియా ఛానెళ్ల అధిపతులపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లను చూడొద్దంటూ ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో.. తెలుగు టాప్ ఛానెళ్లయిన వీటిలో పవన్‌ పార్టీకి సంబంధించిన కవరేజీని పెద్దగా ఆశించలేం. ఎన్నికలు ఎంతో దూరంలో లేని వేళ.. పార్టీకి అండగా న్యూస్ ఛానెల్ ప్రారంభించాలని ఎంతో కాలంగా సన్నిహితులు పవన్‌కు సూచిస్తున్నారు.

దీంతో జనసేనకు అండగా ఉండేందుకు ఓ న్యూస్ ఛానెల్ రాబోతున్నట్టు సమాచారం. జనం కోసం పేరిట కొత్తగా ఛానెల్ రాబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జే టీవీ అనే లోగోతో.. మీకోసం.. మీకు తోడుగా.. అనే క్యాప్షన్‌తో ఈ ఛానెల్ రాబోతుందని తెలుస్తోంది.

ప్రచారంలో ఉన్న లోగో చూస్తుంటే.. జనసేన పార్టీ స్ఫురించక మానదు. ఛానెల్ వ్యవహారాలన్నీ పవన్ సన్నిహితుడు చూసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో జే టీవీ ఫర్ సొసైటీ పేరిట ఓ పేజీ ఉంది. ఇందులోనూ జే టీవీ పేరిట ఛానెల్ రాబోతున్నట్టుగా ఉంది. ఈ ఛానెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.