యాప్నగరం

పవన్ కళ్యాణ్ మే డే శుభాకాంక్షలు

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలిపారు

Samayam Telugu 30 Apr 2017, 8:40 pm
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలిపారు. కుల,మత,జాతి, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచమంతా కలిసి జరుపుకునే ఏకైక వేడుక మే డే అని పేర్కొంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu pawan kalyan wishes on may day
పవన్ కళ్యాణ్ మే డే శుభాకాంక్షలు


‘ఇంట్లో శ్రమించే అమ్మ నుంచి సరిహద్దుల్లో అహర్నిశలు కాపలా కాసే సైనికుడి వరకు అందరు జరుపుకునే పండుగ ఇది. శ్రమ శక్తికి తిరుగులేదని చాటే ఘనమైన రోజు ఇది. కష్టించి పనిచేసే ప్రతీ ఒక్కరి జీవితం సుఖ సంతోషాలమయం కావావాలని ఆకాంక్షిస్తూ...తెలుగు రాష్ట్రాలు..ప్రపంచంలోని శ్రామికులందరికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున మే డే శుభాకాంక్షలు-జైహింద్’ అని ప్రకటనలో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.