యాప్నగరం

నాకు అటువంటి నాయకులే కావాలి: పవన్

పవన్ కల్యాణ్ మంగళగిరి సభలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నిర్మాణంపై వస్తున్న అనేక విమర్శలకి...

TNN 20 Feb 2017, 6:56 pm
పవన్ కల్యాణ్ మంగళగిరి సభలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నిర్మాణంపై వస్తున్న అనేక విమర్శలకి పవన్ ఈ సభా వేదికపై నుంచే స్పష్టమైన వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్లడంలేదో స్పష్టంగా వివరించారు పవన్.
Samayam Telugu pawan kalyans idealogy on janasena formation and politics
నాకు అటువంటి నాయకులే కావాలి: పవన్


ప్రజా సమస్యలపై పోరాటంలో మడమ తిప్పని నాయకుల కోసం ఎదురుచూస్తున్నానని తేల్చిచెప్పిన పవన్.. తనకి దమ్మున్న నాయకులు కావాలి అని స్పష్టంచేశారు. తన, మన భేదం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడటానికి నేను సిద్ధంగా వున్నాను. యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా వెన్నుచూపని నాయకులు నాకు కావాలి. ముఖ్యంగా యువ నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను. కష్టాలకి ఎదురెళ్లిపోరాడే నాయకులు కావాలి. కష్టాల్లో వున్నప్పుడు కూడా పోరాడినప్పుడే వారిలోని అసలైన నాయకత్వం బయటికొస్తుంది. నేను కూడా సరిగ్గా అటువంటి వారికోసమే వెతుకుతున్నాను అని పార్టీ నిర్మాణంపై తన ఆలోచనలని ఈ సభా సాక్షిగా ప్రజలతో పంచుకున్నార్ పవన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.