యాప్నగరం

కేంద్రంపై పవన్‌కి మళ్లీ కోపమొచ్చింది

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కి మరోసారి కేంద్రం తీరుపై కోపమొచ్చింది. మొన్నటికిమొన్న....

Samayam Telugu 23 Apr 2017, 8:01 pm
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కి మరోసారి కేంద్రం తీరుపై కోపమొచ్చింది. మొన్నటికిమొన్న బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాదివాసులని కించపర్చేలా వున్నాయని తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న ఉత్తరాది నేతల తీరుపై మండిపడిన పవన్ కల్యాణ్ తాజాగా కేంద్రం నుంచి వినిపిస్తున్న మరో డిమాండ్‌ని తీవ్రంగా వ్యతిరేకించారు.
Samayam Telugu pawan kalyans tweets about central government in hindi language issue
కేంద్రంపై పవన్‌కి మళ్లీ కోపమొచ్చింది

pic.twitter.com/DC1cprlpmS— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2017
హిందీ భాషకి ప్రతీ ఒక్కరు అధిక ప్రాధాన్యత కల్పించాలనే రీతిలో కేంద్రం వ్యవహరిస్తుండటంపై ట్విటర్ వేదికగా స్పందించిన పవన్.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మనలాంటి దేశంలో కేంద్రం ప్రతీ ప్రాంతాన్ని గౌరవించాల్సిందిపోయి ఈ విభేదాలు ఏంటని ప్రశ్నించారు పవన్. కేంద్రం అవలంభిస్తున్న ఈ వేర్పాటు విధానాల వల్లే వేర్పాటువాద ఉద్యమాలు వస్తున్నాయని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.