యాప్నగరం

గన్‌మెన్లను వెనక్కు పంపిన పవన్..!

సినిమాలకు విరామం ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయిపోతున్న పవన్ ఇటీవలే భద్రతను కోరారు. ఆయన విన్నపానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గన్‌మెన్లను

Samayam Telugu 18 Apr 2018, 11:27 am
ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను తిరస్కరించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. గన్‌మెన్లను వెనక్కు పంపించారాయన. పవన్ కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం 2 ప్లస్ 2 భద్రతను కల్పించింది. పవన్ కల్యాణ్ విన్నపం నేపథ్యంలో ప్రభుత్వం గన్‌మెన్లను నియమించింది. సినిమాలకు విరామం ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయిపోతున్న పవన్ ఇటీవలే భద్రతను కోరారు. ఆయన విన్నపానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గన్‌మెన్లను నియమించింది.
Samayam Telugu PKj


అయితే అనూహ్యంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బందిని తిప్పి పంపడం గమనార్హం. దీని వెనుక ఆసక్తికరమైన రీజన్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది వల్ల తన పార్టీకి సంబంధించిన రహస్యాలు లీక్ అవుతున్నాయని పవన్ అనుకుంటున్నారట.

తన కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వ పెద్దలు వేగులుగా వాడుకుంటున్నారనే అనుమానాలు రేగాయట.అందుకే పవన్ కల్యాణ్ ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కు పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.