యాప్నగరం

2019లో కాంగ్రెస్ కింగ్ మేకర్.. ఇక మా గేమ్ మొదలవుతుంది: రఘువీరా

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ది కీలకపాత్ర అంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. 'రాష్ట్రానికి మా పార్టీనే ప్రత్యామ్నాయమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. ఏపీలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరతాయనే భావనను వారిలో తీసుకొస్తాం.

Samayam Telugu 1 Jun 2018, 4:07 pm
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ది కీలకపాత్ర అంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. 'రాష్ట్రానికి మా పార్టీనే ప్రత్యామ్నాయమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. ఏపీలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరతాయనే భావనను వారిలో తీసుకొస్తాం. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ను కూడా మార్చారు. ఆయన సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగుతాం. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని.. పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెడతాం. 2019 ఎన్నికలే మా టార్గెట్.. ఇక రాష్ట్రంలో మా గేమ్ ప్రారంభం కాబోతోంది' అన్నారు రఘువీరా.
Samayam Telugu Raghuveera


'టీడీపీ ప్రభుత్వ పాలనలో అవినీతిలో పెరిగిపోయింది. చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమై.. మోదీ బాటలోనే నడుస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో విఫలమై.. ఎన్నికలు రానుండటంతో డ్రామాలు వేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నేత అసెంబ్లీ నుంచి పారిపోయాడు. ఎప్పటికైనా చంద్రబాబు, జగన్‌లు మోదీ పక్షమే. ఏపీలో ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్సే కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులే 2019 వరకు కొనసాగితే.. ఏపీలో హంగ్ రావడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తుంది అని జోస్యం చెప్పారు ఏపీ పీసీసీ చీఫ్.

'టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతోంది. మరి బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ పాలకమండలి సభ్యత్వం ఎలా ఇచ్చారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త మహానాడు వేదికపైకి ఎలా అనుమతించారు. ఇవన్నీ చూస్తే మీరు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారని ప్రజలు ఎలా నమ్ముతారు. నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇదే పార్టీలో ఉంటా' అని పార్టీ మారతారని వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.