యాప్నగరం

పెట్రోలు బంకుల్లో పబ్లిక్ టాయిలెట్లు: కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో పబ్లిక్ టాయిలెట్లు (మూత్రశాలలు) నిర్మించేలా చర్యలు తీసుకుంటామని

Samayam Telugu 26 Dec 2016, 10:50 am
హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో పబ్లిక్ టాయిలెట్లు (మూత్రశాలలు) నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంల బీజేపీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు.
Samayam Telugu petrol bunks will facilitate public toilets says minister ktr
పెట్రోలు బంకుల్లో పబ్లిక్ టాయిలెట్లు: కేటీఆర్


హైదరాబాద్ నగరంలో 370 పెట్రోల్ బంకులు ఉన్నట్లు గుర్తించామని వాటిల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ​ వంద రోజుల ఎజెండాలో నగర అభివృద్ధికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మై జీహెచ్‌ఎంసీ పేరిట యాప్ తీసుకొచ్చామని చెప్పారు. దాదాపు 1100కు పైగా చెత్త వేసే ప్రాంతాలను తరలించామన్నారు.

నగరంలోని పలు రహదారుపై వర్షపు నీరు, ఇతర మురుగు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని...సీవరేజ్ వ్యవస్థను పటిష్టపరిచి..ఎక్కడా నీరు నిలిచిపోకుండా రహదారులను చేస్తామని ఆయన అన్నారు.

అన్నిఏరియాల్లో స్మశానాలు నిర్మిస్తామని..ఇందుకు సంబంధించి స్థల సేకరణ ఇప్పటికే స్థల సేకరణ ప్రారంభించామని తెలిపిన కేసీఆర్..జీహెచ్ఎంసీ సిబ్బంది విషయంలో ఏలాంటి కొరత లేదని అన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని అది ఒకరోజులో సాకారమయ్యేది కాదని...నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందిన కేటీఆర్ తెలిపారు. ఐటీ కారిడార్‌లో రూ. 200 కోట్లతో వైట్ ట్యాపింగ్ రోడ్ల కోసం టెండర్లు పిలిచామన్నారు. ఏడాది పొడవునా నాలాల్లో పూడికతీతకు టెండర్లు పిలిచామని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.