యాప్నగరం

ఏపీ సీఎంకు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు

ఏపీ సీఎం చంద్రబాబు గురువారం తన 68వ ఏటలోకి అడుగుపెడుతున్నారు.

TNN 20 Apr 2017, 10:34 am
ఏపీ సీఎం చంద్రబాబు గురువారం తన 68వ ఏటలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక గవర్నర్ నరసింహన్ కూడా ఏపీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు గురువారం ఉదయం నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఆయన ఇంటికి వచ్చే కార్లు వరుసకట్టాయి. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు వేద పండితులతో కలిసి ఉదయాన్నే సీఎం ఇంటికి వచ్చారు. వేదపండితులు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుతూ దీవించారు. అనంతరం అనేక మంది నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత చంద్రబాబు అనంతపురం పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు. గతేడాది కూడా ఆయన తన పుట్టినరోజును అనంతపురంలో చేసుకున్నారు.
Samayam Telugu pm modi wishes chandrababu on his birthday
ఏపీ సీఎంకు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు

Wishing the industrious CM of AP, @ncbn Garu a very happy birthday. May he lead a long life filled with best health. — Narendra Modi (@narendramodi) April 20, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.