యాప్నగరం

కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం చంద్రబాబు లేఖ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ.431 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు.

Samayam Telugu 25 Jun 2018, 10:39 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ.431 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సోమవారం (జూన్ 25) లేఖ రాశారు. దీంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి అదనంగా పెరిగిన వ్యయం రూ.1,501 కోట్లను కూడా విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పోలవరం కోసం రూ.13,798.54 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం తన లేఖలో వివరించారు.
Samayam Telugu babu


పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 8,662.67 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం మాత్రం రూ.6,727.26 కోట్లు మాత్రమే అందించిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇప్పటికీ 1935.41 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులతో పాటు.. పోలవరం నిర్మాణం, భూసేకరణ పరిహారం కోసం రూ.10వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.