యాప్నగరం

2019లోగా పోలవరం పూర్తిచేస్తాం: గడ్కరీ

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు.

TNN 3 Oct 2017, 2:05 pm
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ నగరపాలక సంస్థ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు రూ.1.614.03 కోట్ల వ్యయంతో 381.9 కి.మీ మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తయిన ఏడు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు.ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.... దేశంలో 80 శాతం రవాణా జాతీయ రహదారులపై జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారిని నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu polavaram project will be completed before 2019 election nitin gadkari
2019లోగా పోలవరం పూర్తిచేస్తాం: గడ్కరీ


రైలు, రోడ్డు మార్గాల్లో రద్దీ నియంత్రణ, తక్కువ ఖర్చుతో ప్రయాణానికి అవకాశం ఉంటుందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. నేడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కూడా 2019 సార్వత్రిక ఎన్నికల్లోపు పూర్తిచేస్తామని గడ్కరీ ఈ సంర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పేర్కొన్నారు.

జాతీయ ఉపరితల జల రవాణా మార్గం-4 అభివృద్ధిలో భాగంగా ముక్త్యాల- విజయవాడ మధ్య కృష్ణా నదిలో చేపడుతున్న తొలిదశ ప్రాజెక్టు పనుల్ని సైతం ఈ సందర్భంగా ప్రారంభించారు. ముక్త్యాల- విజయవాడ మధ్య కృష్ణా నదిలో 82 కిలోమీటర్ల మేర నావిగేషన్ ఛానల్ తవ్వకం పనులతోపాటు టెర్మినళ్ల నిర్మాణాన్ని తొలిదశలో చేపడతారు. రెండో దశలో విజయవాడ నుంచి కాకినాడ వరకు నౌకలు ప్రయాణించే కాలువ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఈ దశలోనే కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కృష్ణా- ఏలూరు కాలువ, గోదావరిలో రాజమండ్రి నుంచి పోలవరం వరకు పనులు జరుగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.