యాప్నగరం

కడప: ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్ష భగ్నం

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 27 Jun 2018, 7:01 pm
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. గత ఎనిమిది రోజులుగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌తో పాటూ రవి దీక్ష చేస్తున్నారు. రెండు రోజులుగా ఆయన షుగర్, బీపీ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి చేరాయి. ఆయనకు వెంటనే వైద్యం అందించాలని డాక్టర్లు ఉదయం హెచ్చరించారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ నేతలు కోరినా ఆయన నిరాకరించారు.
Samayam Telugu B-Tech Ravi


సాయంత్రం రవికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఇలాగే దీక్ష కొనసాగిస్తే అపస్మారకస్థితిలో వెళ్లి ప్రాణానికికే ముప్పు వస్తుందని మరోసారి హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రవి దీక్షను భగ్నం చేశారు. వారిని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. అయితే రవి మాత్రం అక్కడా దీక్షను కొనసాగిస్తానంటున్నారు. ఇటు ఎంపీ సీఎం రమేశ్‌ను కూడా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.