యాప్నగరం

అబ్బురపరిచిన కిరణ్మయి నాట్యవిన్యాసం

సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్‌దీప్ కౌర్ మీనన్ రచించిన ‘పున్నామిని’ అనే కవితా సంపుటిలోని ‘ద పోరస్ ఎర్త్’ని నాట్యంగా మలిచారు నాట్య కళాకారిణి కిరణ్మయి.

TNN 9 Jul 2017, 4:52 pm
సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్‌దీప్ కౌర్ మీనన్ రచించిన ‘పున్నామిని’ అనే కవితా సంపుటిలోని ‘ద పోరస్ ఎర్త్’ని నాట్యంగా మలిచారు నాట్య కళాకారిణి కిరణ్మయి. ఒక నది ప్రయాణం ఎలా ఉంటుందో ‘ద పోరస్ ఎర్త్’లో తేజ్‌దీప్ కౌర్ అక్షరీకరణ చేశారు. ఇప్పుడు ఆ అక్షరాలను నాట్యం రూపంలో చూపించి కిరణ్మయి అబ్బురపరిచారు. హైదరాబాద్ ఆర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా శనివారం సాయంత్రం కొండాపూర్‌లోని హోటల్ మినర్వా గ్రాండ్‌లో ఈ అద్భుత నాట్యాన్ని ప్రదర్శించారు.
Samayam Telugu porous earth the journey of a river a thematic dance presentation by kiranmayee madupu
అబ్బురపరిచిన కిరణ్మయి నాట్యవిన్యాసం


ఇది భారత్‌లోనే అత్యంత సుదీర్ఘమైన ఆర్ట్ ఫెస్టివల్. మే 20న మొదలైన హైదరాబాద్ ఆర్ట్స్ ఫెస్టివల్.. జూలై 22 వరకు మూడు నెలలపాటు కొనసాగనుంది. కాగా, శనివారం నిర్వహించిన నాట్య ప్రదర్శనకు ప్రముఖ నాట్యకారిణి హేమమాలిని అర్ణి కొరియోగ్రఫీ వహించారు. సుమారు 500 మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తేజ్‌దీప్ కౌర్ తన సంపుటిలో వివరించినట్లే నదీ ప్రయాణాన్ని కిరణ్మయి తన నాట్యంలో కళ్లకు కట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.