యాప్నగరం

అక్రమాస్తులను కాపాడుకునేందుకే టీడీపీలోకి!

అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడాన్ని ఆక్షేపించారు...

TNN 30 Nov 2017, 2:55 pm
అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడాన్ని ఆక్షేపించారు టీడీపీ నేత, అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్ గా మీడియాతో మాట్లాడిన చౌదరి గురునాథరెడ్డిపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో అనంతపురం నుంచి గురునాథరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయగా.. చౌదరి తెలుగుదేశం తరఫు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గురునాథరెడ్డి టీడీపీలో చేరుతుండటంపై చౌదరి అసహనంతో ఉన్నారు. దాన్ని ఆయన బహిరంగంగానే చాటుతున్నారు.
Samayam Telugu prabhakarchowdary opposes gurunath reddy tdp joining
అక్రమాస్తులను కాపాడుకునేందుకే టీడీపీలోకి!


‘అక్రమాస్తులను కాపాడుకోవడానికే గురునాథరెడ్డి టీడీపీలోకి వస్తున్నారు. చంద్రబాబు పక్కన నిలబడటానికి ఆయనకు అర్హత లేదు. నేను కూడా గురునాథరెడ్డిని పట్టించుకోను. ఆయనతో ఫొటో దిగడానికి కూడా నేను ఇష్టపడను. మా పార్టీలోని వాళ్లలో జేసీ దివాకర్ రెడ్డి తప్ప ఎవ్వరూ గురునాథరెడ్డి చేరికను స్వాగతించడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లపై చెప్పులు వేయించాడు గురునాథరెడ్డి. అలాంటి వ్యక్తి చేరడాన్ని నేను ఎలా సమర్థిస్తా?’ అని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు.

ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు చౌదరి. అయితే గురునాథరెడ్డిని చేర్చుకోవడానికే బాబు మొగ్గు చూపారాయన. టికెట్ విషయంలో మాత్రం తనకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.. అని చౌదరి చెప్పుకున్నారు. అయితే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం.. అంతా కలిసి చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తారని, ప్రభాకర్ చౌదరి ప్రత్యేకంగా నేత ఏమీ కాదని.. వ్యాఖ్యానించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.