యాప్నగరం

ప్రత్తిపాటి సవాల్: స్పందించని జగన్

ఏపీ అసెంబ్లీ గురువారం మధ్యాహ్నం ఆరోపణలు, సవాళ్లతో దద్దరిల్లింది.

TNN 23 Mar 2017, 2:35 pm
ఏపీ అసెంబ్లీ గురువారం మధ్యాహ్నం ఆరోపణలు, సవాళ్లతో దద్దరిల్లింది. ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ భూములు మంత్రి కొన్నారని ఆరోపించారు. గత సమావేశాలలో కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. కాగా ప్రత్తిపాటి ఈసారి చాలా ఘాటుగా స్పందించారు. తాను భూములు కొన్న సంగతి నిజమే కానీ... అవి అగ్రిగోల్డ్ వి కాదని అన్నారు. తాను అగ్రిగోల్డ్ కు చెందిన భూములు కొన్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రత్తిపాటి విసిరిన సవాల్‌ను జగన్ స్వీకరించాలని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలను చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. సవాల్ చేస్తే స్వీకరించే ధైర్యం లేని వ్యక్తి ఆరోపణలు చేయకూడదని అన్నారు.
Samayam Telugu prathipati pulla rao challenge to ys jagan over agri gold issue
ప్రత్తిపాటి సవాల్: స్పందించని జగన్


స్పీకర్ కోడెల కూడా ప్రత్తిపాటి సవాల్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, సమస్యను సాగదీస్తూ జఠిలం చేయొద్దని జగన్ ను కోరారు. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా సవాల్ స్వీకరించి ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. అయినా కూడా జగన్ ఆ సవాల్ ను స్వీకరించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.