యాప్నగరం

ఓయూకు రావడం గౌరవంగా భావిస్తున్నా: రాష్ట్రపతి

ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల వేడుకకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నట్టు భారత రాష్ట్రపతి అన్నారు.

TNN 26 Apr 2017, 1:30 pm
ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల వేడుకకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నట్టు భారత రాష్ట్రపతి అన్నారు. ఓయూ శతాబ్ధి వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన సభ నుద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీలలో ఒకటని అన్నారు. ఓయూ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. వందేళ్ల క్రితం ఇదే రోజున ఓయూ ప్రారంభమైందన్నారు. ఈ యూనివర్సిటీని మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ ఒక విజన్‌తో యూనివర్సిటీని స్థాపించారని మెచ్చుకున్నారు. ఈ వందేళ్లలో యూనివర్సిటీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు.
Samayam Telugu president pranab mukherjee speech at ou centenary celebrations
ఓయూకు రావడం గౌరవంగా భావిస్తున్నా: రాష్ట్రపతి


దేశంలో 757 ఉన్నత విద్యాలయాలు ఉన్నాయని అందులో ఓయూ కూడా ఉన్నతమైనదని అన్నారు. ఉన్నత విద్యలో ప్రపంచదేశాలతో భారత విద్యార్థులు పోటీపడాలని అన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాలన్నారు. పరిశోధనా రంగంలో, ఆవిష్కరణలలో విద్యార్థులకు మరింత పోత్సాహాన్ని అందించాలని ఆయన యూనివర్సిటీ అధికారులను కోరారు. పరిశోధనా రంగంలో మన విద్యార్థులు సాధించాల్సింది చాలా ఉందన్నారు. మేధావుల ఆలోచనలకు యూనివర్సిటీలే వేదికలని అన్నారు. ఐఐటీలలో చదివిన విద్యార్థులకు వందశాతం ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయని, యూనివర్సిటీలలో విద్యార్థులు పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.